ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో బీసీ జేఏసీ సమన్వయ సమావేశం పాగర్తి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా బీసీ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాల్వంచ రామారావు మాట్లాడుతూ చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు బీసీ బందు ప్రకటించాలని వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు సిటు కేటాయించాలని, జిల్లాలోని ప్రతి నియోజకవర్గం లో బీసీ భవనం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ గా నెలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామానికి చెందిన పాగర్తి సుధాకర్ నియమించడం జరిగింది ఈ సమావేశం లో బీసీ సంఘం నియోజకవర్గ నాయకులు అన్నారపు రాములు, మారిశెట్టి వెంకటేశ్వర్లు, సత్యనపల్లి రాము, తోగటి నాగచారి, రామవరపు నాగరాజు, పంతగి నర్సింహారావు, బండి బ్రహ్మం,గోపీ, క్రాంతి, శ్రీను,వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు