జగిత్యాల, ఏప్రిల్ 20: తెలుగుదేశం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం జగిత్యాలలో అట్టహాసంగా, ఘనంగా జరిగాయి. స్థానిక టవర్ సమీపంలో టిడిపి జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, శ్రేణులు కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహంకాళి రాజన్న మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయం, జినామ్ వ్యాలీ నిర్మాణంతో నేడు కోవిడ్ వ్యాక్సిన్ తయారైందన్నారు. మెట్రో రైలు నిర్మాణం, ప్రజల వద్దకు పాలన, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన ఘనత చంద్రబాబుదన్నారు. ఓకేదఫాలో లక్ష్య 70 వేల టీచర్ ఉద్యోగాలను బాబు భర్తీ చేశాడన్నారు. ఒకానొక దశలో ప్రధానమంత్రి పదవి అవకాశం చంద్రబాబుకు వచ్చినా తిరస్కరించిన ఘనుడన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న టిడిపిని 2024 లో బలపరచాలని రాబోయే తరానికి అభివృద్ధి ఫలాలు అందేలా టీడీపీని ఆదరించాలని మహంకాళి రాజన్న కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బత్తుల కొండయ్య యాదవ్, కొండ శ్రీధర్ పట్టణ అధ్యక్షుడు, అక్కినపల్లి కాశీ నాథం, రాష్ట్ర నాయకులు నక్క లక్ష్మణ్, మగ్గిది గంగాధర్, జున్ను మల్లయ్య, కోయ బాలకృష్ణ, అఖిల్, ఆవుల రాయుడు, అడిగి గంగారెడ్డి, ఆవుల నర్సయ్య, నర్సయ్యలు పాల్గొన్నారు