జగిత్యాల, ఏప్రిల్ 20: రాయికల్ ఎస్ ఐ కిరణ్ పై గురువారం రంజిత్ కుమార్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగపూర్ కు చెందిన సూతారి రంజిత్ కుమార్ తన భార్యతో ఉన్న గొడవలో కాంప్రమైజ్ కావడానికి అత్తగారింటికి వెళ్ళానని ఫిర్యాది పేర్కొన్నాడు. అక్కడ చిన్నపాటిగా గొడవ జరగడంతో స్థానికులు డయల్ హండ్రెడ్ ఫోన్ చేశారని అక్కడికి వచ్చిన పోలీసులు స్టేషన్ కు రావాలని చేప్పారని పేర్కొన్నారు. స్టేషన్ కు పోగా అక్కడే ఉన్న డిఎస్పీ సమక్షంలోనే కాంప్రమైజ్ కోసం వచ్చామని గొడవ ఏమిలేదని పోలీసులకు రంజిత్ కుటుంబీకులు తెలిపారు. అక్కడే ఉన్న డిఎస్పీ సమక్షంలోనే డయల్ హండ్రెడ్ కేసును 2021 క్లోజ్ చేశారన్నారు. ఎవరో ఒకరి సిఫార్స్ తో తిరిగి 2022 లో 8 మందిపై 6 సెక్షన్ల క్రింద చేయని తప్పుకు ఎస్ ఐ కిరణ్ కేసు నమోదు చేశాడని ఫిర్యాది రంజిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ ని కలవగా డిఎస్పీ తో విచారణ ఆదేశాలు జారిచేసినట్లు సూతారి రంజిత్ కుమార్ పేర్కొన్నారు.