15 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ (SPARKLES) నిర్వహణ

 

ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహణ…..

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ఏప్రిల్ 20: ప్రజ బలం ప్రతినిది:
జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కోసం 15 రోజుల పాటు ఈ నెల 22 నుండి మే 6 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ నిర్వహణకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఎస్పీ రమణ కుమార్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు 15 రోజులపాటు సమ్మర్ క్యాంప్ (SPARKLES) నిర్వహిస్తున్నామ న్నారు.
ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, హత్నూరలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్యాంపులలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
సమ్మర్ క్యాంపులో మంచి వాతావరణంలో పిల్లలకు అవసరమైన అదనపు నైపుణ్యాలను అందించే దిశగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమ్మర్ క్యాంపులో పిల్లలకు నాట్యం, మ్యూజిక్, స్పానిష్, రోబోటిక్స్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, టి ఎస్ ఆర్ టి సి ఆర్ఎం సుదర్శన్, ఆర్ సి ఓ భీమయ్య, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సూపరిండెంట్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking