ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈ నెల 12న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లు గురువారం పరమర్శించారు. బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అందుతున్న వైద్యం గురించి వైద్యులతో మాట్లాడారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వ పరంగా అన్నివిధాల అదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ గణేష్ , ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ,ఎస్బి ఏసీపీ ప్రసన్న కుమార్ తదితరులు ఉన్నారు.