ఉద్యోగినుల సౌకర్యార్థం ఐడిఓసిలో ఏర్పాటు చేసిన క్రచ్చే (పిల్లల సంరక్షణ కేంద్రం) ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్చే కేంద్రంలో చిన్న పిల్లల సంరక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా వారి చిన్న పిల్లలను కార్యాలయమునకు రాగానే సంరక్షణ కేంద్రం క్రచ్చేలో సంరక్షకులకు అప్పగించి నిశ్చింతగా తమ విధులను సమర్ధవంతంగా ముగించుకొని, ఇంటికి వెళ్లెప్పుడు తిరిగి తీసుకొని వెళ్లవచ్చని ఆయన అన్నారు. క్రచే కేంద్రంలో పిల్లల ఆట వస్తువులు, వారి సంరక్షణకు సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking