ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో శేశోద్యల ప్రతాప్ సింగ్ అనే 55 సంవత్సరాల వ్యాపారి తన దుకాణంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడు తన భార్యతో కలిసి బొల్ల దుకాణం నిర్వహిస్తున్నాడు.గత కొంత కాలంగా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు.అక్కడక్కడా అప్పులు కూడా చేసాడు. గత కొద్ది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులతో ఎదో వ్యాపారం చేసి డబ్బు పొడగొట్టుకుని ఇబ్బంది పడ్డారు.తనకు కూడా బయట సుమారు కోటి రూపాయల వరకు రావాల్సి ఉంది.తనకు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా తను తెచ్చిన చొట ఇచ్చిన మాట ప్రకారం చెల్లించలేక పోతున్నానని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఇచ్చే అప్పు వివరాలు అదేవిధంగా తనకు ఇవ్వాల్సిన వాళ్ళా వివరాలు మొత్తం సూసైడ్ నోట్ లో రాసి మృతికి పాల్పడ్డాడు. మృతుని భార్య ఉమ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై పి సతీష్ తెలుపారు.