జగిత్యాల ప్రతినిధి, ఆగస్టు10,( ప్రజా బలం) కార్మిక శక్తి బీడి వర్కర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా కార్యదర్శిగా బొల్లి అశోక్ నియమితులయ్యారు. బుధవారం ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంగం స్వామి నియామక పత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు విరభత్తిని మల్లేశం ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టామన్నారు. కార్మికులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ పూర్తి సహకారాలు అందించాలని స్వామి సూచించారు. తన నియామకానికి కృషిచేసిన ప్రతిఒక్కరికి బొల్లి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల అశోక్ తోపాటు పలువురు ఉన్నారు.