ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 : ఉద్యాన వన విస్తరణ అధికారులను రెన్యూవల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది.గురువారం మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కన్వీనర్ కానిగంటి లక్ష్మన్ వర్మ మాట్లాడుతూ…గత 15 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో పండ్ల తోటలు, కూరగాయల సాగు చేయడంలో ఉద్యాన విస్తరణ అధికారుల సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.గత మూడు సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో రైతులు ఉద్యాన పంటలను సాగు చేయడానికి సలహాలు, సూచనలు చేయడానికి మండల స్థాయి అధికారులు లేకపోవడం వలన రైతులు కూరగాయల పంటల వైపు మొగ్గు చూపడం లేదు.గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో కూరగాయల రేట్లు కూరగాయల కొరత విపరీతంగా పెరిగింది.దీనికి ప్రధాన కారణం రైతులు కూరగాయలను సాగు చేయడం చాలా మంది మానేస్తున్నారు.కావున మళ్లీ క్షేత్రస్థాయిలో ఉద్యాన విస్తరణ అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకొని రాష్ట్రంలో పండ్ల తోటలు కూరగాయల తోటలు సాగుకు నాంది పలకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కోరుకుంటుంది.15 సంవత్సరాల నుండి ఉద్యానవన శాఖలో విధులు నిర్వహిస్తున్న కరోన సమయంలో బడ్జెట్ కారణంగా స్కీమును రెన్యువల్ చేయకపోవడం వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉద్యానవన విస్తరణ అధికారులు రోడ్డున పడ్డారు. కావున వీరిని తిరిగి విధుల్లోకి తీసుకొని రాష్ట్రంలో ఉద్యానవన పంటల పెంపుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.