రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 జులై 2024:
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మణికొండ మునిసిపల్ అంతర్భాగమైన ఈ.వీ.వీ కాలనీ ఉపాధ్యక్షుడు గంటా రామ్మోహన్, కార్యదర్శి షేక్ ఆరీఫ్ మొహమ్మద్, కొశాధ్యక్షుడు ప్రసాద్, కాలనీ వాసులు వంశి, అహ్మద్ అల్ మొహమ్మది, విష్ణు, శమీమ్ల కోరిక మేరకు ది సిటిజన్స్ కౌన్సిల్ ఉప కార్యదర్శి బొమ్ము ఉపేంద్రనాధ్ రెడ్డి స్వంత ఖర్చులతో ఈ.వీ.వీ కాలనీ నుండి బటర్ ఫ్లై కూడలి వరకు, వీలైతే అన్య కాలనీ వాసులు సహకరిస్తే అక్కడక్కడ గుంతలమయంగా ఉన్న రహదారి లకు మరమ్మత్తులు చేయించ డానికి ఏర్పాట్లు చేయగలమని బొమ్ము ఉపేంద్రనాధ్ రెడ్డి తెలియ జేసినారు, ఈ విషయం తెలుసుకొని మణికొండ మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఏ.ఈ సంజీవ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంపత్ వచ్చి పర్యవేక్షణ చేసినారు, ఈ సందర్భముగా ఏడవ వార్డ్ కౌన్సిలర్ బిట్లు పద్మారావు, ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, సామాజిక కార్యకర్త సురేఖ మహేష్ గౌడ్, బాబు హిల్స్ కాలనీ అధ్యక్షుడు రాజు తది తరులు పాల్గొన్నారు.
