ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 27:
తార్నాక నారాయణ పాఠశాలలో బోనాల పండుగను శనివారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు వేసిన అమ్మవారి, శివ సత్తుల, పోతరాజుల వేషాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ. సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతధులుగా జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలాపరమేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలు పూర్వకాలంలో వర్షాకాలం ఆరంభంలో వచ్చే కలరా, అతిసారం తదితర వ్యాధులు ప్రబలకుండా వేపాకు, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉందని తెలిపారు. ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడంతో విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేవాళ్లం అవుతామని, వారసత్వం అందించిన వారు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పర్వీన్, ఏఓ మహేందర్, పి ఈ టి నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.