దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత యాదవ మహాసభ నాయకులు

 

మేకల మల్లి బాబు యాదవ్ చిత్తారు సింహాద్రి యాదవ్

ఖమ్మం ప్రతినిధి జులై 27(ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామానికి చెందిన సింగరేణి మండలం సాయిబాలాజి హోటల్ ప్రొప్రైటర్ మారమైన రామచంద్ర యాదవ్ ( రాము హోటల్ ) గారి తండ్రిగారైన మారబోయిన నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శనివారం నాడు జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమాల్లో అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, అఖిలభారత యాదవ యువజన అధ్యక్షులు చిత్తారి సింహాద్రి యాదవ్ లు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ యాదవ్, బండారి ప్రభాకర్ యాదవ్ మద్దె బోయిన మల్లేష్ యాదవ్, పచ్చిపాల వెంకట్ పచ్చిపాల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking