వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ప్రజాబలం వివేకానంద నగర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నామని. అదేవిధంగా 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వర్క్‌షీట్‌లు,పుస్తకాలు మరియు 6 వ తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తి చేయడం జరిగినది అని. తరగతి గదులను అలంకరించి, ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేయడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.