కాంగ్రెస్ పార్టీ నాయకుల పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఖండించిన దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : గత కొన్ని రోజులు మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై కాంగ్రెస్ పార్టీ నాయకులపై సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి రావు పై బీజేపీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి మండిపడ్డారు. కొర్విచెల్మ గ్రామం లో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిధులు స్వాహా చేశారని అసత్య ప్రచారం చేయడం అలాగే మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై లేని పోని అబండాలేస్తూ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్న వారికి చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రేమ్ సాగర్ రావు గారు అనునిత్యం కృషి చేస్తున్నారు అని అన్నారు.రైతాంగ సమస్యలు పరిష్కరిస్తూ విద్య వైద్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు అసలు ఆరోపణలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, నాయకులు ముత్యాల శ్రీనివాస్ కొంగల నవీన్,ఆకుల దుర్గాప్రసాద్,ఆకుల రాజేందర్,వెంగల రావు,ముద్దసాని వేణు,ముత్తే వేంకటేష్, చిట్ల రమణ,అంబటి పల్లి రవి,బండ రాకేష్,సి ఎచ్ రాజేష్, బొప్పిది మురళి, చుంచు నగేష్, తదితరులు పాల్గొన్నారు.