ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 04 : లక్షెట్టిపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొప్పు సుమన్ నియమితులయ్యారు. బుధవారం యూత్ కాంగ్రెస్ పోస్టులకు ఫలితాలు వచ్చాయి.అందులో యూత్ కాంగ్రెస్ లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా చిన్న వెంకటేష్,మండల ఉపాధ్యక్షుడిగా పోశు కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తమపై నమ్మకంతో గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,లక్షెట్టిపేట మండల నాయకులు,పట్టణ నాయకులు సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.