ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 5:
ప్రజా పాలనా ప్రజా విజయోత్తవలలో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజ్గిరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయిలో స్వయం సహాయ సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి ద్వారా సాధించిన ప్రగతి గురించి స్వయం సహాయక సంఘాల సమావేశా లను ఏర్పాటు చేయడము ర్యాలీ లు నిర్వహించడము జరిగినది. అలాగే మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో ముఖ్య మంత్రి గారిచే ఈరోజు ఇందిరా మహిళా బజార్ ఓపెనింగ్ కార్యక్రమం శిల్పారామం లో ఉన్నందున మన జిల్లానుండి 4గురు ఎంటర్ ప్రేన్యూర్, ఎస్ హెచ్ జి మెంబర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా శక్తి లో భాగంగా మండలానికి ఒకటి చొప్పున కాంటీన్ లు, బ్యాక్ యార్డ్ పోల్ట్రీ 100మందికి, మదర్ యూనిట్ లు 3, ఎంటర్ ప్రైజస్ 1250, సంఘాలలో లేనివారిని సంఘాలలో 1700, మందిని కృత సంఘాలలోకి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మూసి నిర్వాహక ప్రాంతాల్లో నుండి పునరావాసం కల్పించబడిన ప్రతాప్ప్సింగారం గ్రామపంచాయతీ నందు ఈరోజు సమావేశం ఏర్పాటుచేసి సభ్యులను కొత్త సంఘాలలోకి చేర్పించి వారికి మహిళా శక్తి కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారికి కూడా ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక సహాయం అందించుటకు సూచించనైనది.