మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో రెండవ కొండగట్టుగా పేరుగాంచిన మహిమగల భక్త వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ భక్త బృందం ఆత్రేయ గురుస్వామి సమక్షంలో నాయకులు బండ నాగరాజు యాదవ్ సహకారంతో భక్తులకు సౌకర్యార్థం త్రాగడానికి ,సుద్దిగా స్నానం ఆచరించడానికి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి బోర్ వేయించారు. అనంతరం రాష్ట్ర నాయకులు బండ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ హనుమంతుని కృపతో వాటర్ ఫుల్ రావడం ,సంతోషకరంగా ఉందని ఇక్కడ హనుమంతుడు భక్తులకు కోరిన కోరికలను ఇస్తూ ఇలవేల్పుగా కొలవబడుతున్నాడని నమ్మకంతో ఇక్కడ దైవదర్శనం చేసినచో అన్ని విధాల శుభాలు జరుగునని మాట్లాడుతూ తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్,రేపల్లె యాదగిరి,గడ్డం ప్రశాంత్ కుమార్, రేపల్లె నాగరాజు,రాథోడ్ యాదగిరి,రమేష్,
శ్రీకాంత్ ప్రజా ప్రతినిధులు హనుమాన్ భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.