పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి- విజిల్ : కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావీణ్య

ఆర్వోలతో కలిసి సి- విజిల్ మొబైల్ ఆప్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, టోల్ ఫ్రీ నెంబర్ గోడ ప్రతులు, ఆవిష్కరణ.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 20:

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘన లో పౌరుని చేతిలో సి- విజిల్ మొబైల్ ఆప్ ఒక బ్రహ్మాస్త్రం అని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావిణ్య తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సి- విజిల్ మొబైల్ ఆప్, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన లో భాగంగా ప్రజలకు చైతన్యం ఫిర్యాదులకు, టోల్ ఫ్రీ నెంబర్1950, కరపత్రాలు, గోడ ప్రతులను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం
ఈ యాప్ ఆధునీకరించి ఫ్లయింగ్ స్క్వాడ్ తో అనుసంధానం చేయడం వల్ల ఎన్నికల ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు ఫిర్యాదులు ఈ యాప్ అప్లోడ్ తో 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి ఫిర్యాదు దారుడు తెలుసుకొనే విధంగా ఈ ఆప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.సి- విజిల్ మొబైల్ ఆప్
ద్వారా ఇప్పటివరకు 16 ఫిర్యాదులు అందాయని అన్నారు. ఉఈ ఆప్ పై మరింత ప్రజల్లో మరింత ప్రాచుర్యం కల్పించాలని అధికారులను కలెక్టర్ సూచించారు.
ప్రశాంత, పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును డబ్బు, మద్యం అక్రమ బట్వాడా మరియు ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తాయని ఉచిత బహుమతులకు ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కును ప్రజలు అమ్ముకో వద్దన్నారు
స్వేచ్ఛ మరియు నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే ఓటర్ లో చైతన్యం రావాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట రిటర్నింగ్ అధికారి అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట రిటర్నింగ్ అధికారి ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ తూర్పు రిటర్నింగ్ అధికారి జి డబ్ల్యు ఎం సి కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీవో వాసు చంద్ర, స్వీప్ జిల్లా నోడల్ అధికరి నర్సింహ మూర్తి, ఎన్నికల విభాగం తాసిల్దార్ విశ్వ నారాయణ, సంబంధిత వివిధ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking