రిటర్నింగ్,వివిధ రాజకీయ పార్టీల తో సమావేశం.

 

వరంగల్ ప్రజబలం ప్రతినిధి అక్టోబర్ 20:

అసంబ్లీ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) మొదటి దశ ర్యాండమైజేషన్ శుక్రవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) పి. ప్రావీణ్య ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించరూ.

వరంగల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు మరియు వీవీప్యాట్‌ల కేటాయింపు కోసం మొదటి దశ ర్యాండమైజేషన్ జరిగింది. జిల్లాలోని మూడు అసంబ్లీ సెగ్మెంట్లకు 987 ఈవీఎంలు, 1107 వీవీప్యాట్‌లను కేటాయించారు, ఇందులో నర్సంపేట నియోజక వర్గానికి 353 ఈవీఎంలు, 396 వివి ప్యాట్లు, వరంగల్ తూర్పు కు 287 ఈవీఎంలు, 322 వివి ప్యాట్లు,
వర్షన్నపేట్ కు 347
ఈవీఎంలు, 389 వివి ప్యాట్లు ఉన్నట్లు వివరాలు తెలిపిన అనంతరం
డీఈవో ప్రావీణ్య మాట్లాడుతూ మానవ ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే ర్యాండమైజేషన్ ధ్యేయమని, ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ర్యాండమైజేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాండమైజేషన్‌కు ముందు, జిల్లా ఎన్నికల అధికారి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి రాజకీయ ప్రతినిధులకు వివరించారు.
ర్యాండమైజేషన్ తర్వాత శనివారం ఉదయం నుండి ఏనుమాముల మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల్లోని ప్రత్యేక స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించి, వాటిని పటిష్టమైన భద్రత, రక్షణలో ఉంచుతామని, పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు కోసం రానున్న కాలంలో మరింత ర్యాండమైజేషన్ చేస్తామని ఆమె చెప్పారు.

ఈ సమావేశంలో నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట ఆర్ ఓ లు క్రిష్ణ వేణి, షేక్ రిజ్వాన్ బాషా, తానాజీ వాఖడే, ఆర్డీఓ వాసు చంద్ర, ఏ ఆర్ ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking