హైదరాబాద్, అక్టోబర్ 20 :పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిపురస్కరించుకొని రేపు, శనివారంనాడు, గోషామహల్ స్టేడియం లో పోలీస్ ఫ్లాగ్ డే జరుగుతుంది. ఉదయం 8 .45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్లాగ్ డే సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ సందేశం ఉంటుంది. ఈ సందర్బంగా ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసులకు నివాళులు అర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసాధికారులు, పోలీసు అమరుల కుటుంబాలు పాల్గొనే ఈ కార్యక్రంలో పాల్గొంటాయి. పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ ను నిర్వహిస్తున్నట్టు వివరించారు.