ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా ఎస్పీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈరోజు నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ.చల్లా ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల వారోత్సవాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాoగ్వాన్ హాజరై అమరవీరుల స్మారకార్థం కాగడాను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో,రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.అక్టోబర్ 21 యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో కొంత మంది పోలీస్లు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుందాం.దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. వారి స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నదే అమరవీరుల దినోత్సవం. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం, అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది, ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు.ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే, పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం.ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే, ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు, దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే,అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు, శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం, అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ రిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు . అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ మరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను అదనపు ఎస్పీ వీరన్న చదివారు.
అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించినారు.ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరియు యువత 54 యూనిట్ల రక్తదానం చేసినారు.
ఆనంతరం పోలీస్ అమరవీరులను స్మరించుకుంటు పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బయలుదేరిన పోలీస్ అమరులకు జోహార్లు అంటూ నినాదిస్తూ మంచిర్యాల్ చౌరస్తా వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వీరన్న, వెంకటేశ్వర్లు, భైంసా ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి, డిఆర్బి డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సి.ఐ.లు, ఆర్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు