రాజేంద్రనగర్ నియోజకఅల్పాహారవర్గ ప్రజా బలం ప్రతినిధి 27 జనవరి 2025
గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణికొండలో చదివే పదవ తరగతి విద్యార్థులకు పాఠశాల సమయం తరువాత అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ తెలుపుతూ అందు నిమిత్తం విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడానికి గాను గ్రామ పెద్ద, మణికొండ మునిసిపాలిటీ మాజి కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి ఆద్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది, ఆ దరిమిలా వి.ఆర్.4 సహాయోగ్ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు సారథ్యంలో అవసరాన్ని బట్టి సక్రమముగా అల్పాహార వితరణ ఏర్పాట్లు రేపటి నుండి మొదలుకొని పరీక్షల వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఉపాద్యాయుడు శివరాం, ట్రస్ట్ కోశాధికారి దిలీప్ కక్కడ్, గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ నుండి సుబ్రమణ్యం, నరసింహం, మురళి రావు, మస్తాన్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.