పుష్పలంకరణ వేడుకలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిది జనవరి 27 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ 15వ డివిజన్ కొత్తగూడెం కు చెందిన యాదవ సంఘం నాయకులు పల్లెబోయిన పుల్లారావు -సుజాత ల కూతురు చి. కుసుమాంజలి పుష్పాలంకరణ సందర్బంగా జరిగిన వేడుకలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని పుష్పాక్షితలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో హాజరైన పలువురు యాదవ సంఘం నాయకులు, యాదవులు జరిగిన చర్చలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ యాదవులకు చట్టసభలలో గాని, జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, సముచిత స్థానం కల్పించే వరకు, గొర్రెల పెంపకం దారుల సమస్యలు పరిష్కారం కొరకు గతంలో జరిగినట్లుగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, వర్గాల కతీతంగా, పార్టీలకతీతంగా యాదవులు ఐక్యతతో సమస్యల కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకల వెంకటనరసయ్య పల్లెబోయిన రామ సంగం, రాములమ్మ,యరగొర్ల హనుమంతరావు, మొరిమేకల కోటయ్య,చేతుల నాగేశ్వరరావు మేకల నాగేశ్వరావు, మలీదు వెంకటేశ్వర్లు, బొల్లి కొమరయ్య,చిర్ర శంకర్, తుప్పటి రవి, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, బమ్మిడి శ్రీనివాస్, బొల్లు సైదులు, పొదిలి సతీష్ దుబాకుల వెంకటేశ్వర్లు, బండారి ప్రభాకర్, సత్తి వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking