ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఆర్ ఎం ఓ. డాక్టర్.వేణుగోపాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకని సాగర్ కలనీ లోని వృద్ధశ్రమంలో అల్పాహారం పంచి జరుపుకున్నారు. వృద్ధులు, పెద్దవాళ్లు, తల్లిదండ్రుల లాంటి వాళ్లని గౌరవించలని, వారిని తమతోనే వుంచుకుని సేవలందించాలన్నారు. కుటుంబంలో విలువలు తల్లి దండ్రులపై ప్రేమ, గౌరవం,బాధ్యత కలిగి వారిని దైవంగా భావించలన్నరు, డా. వేణుగోపాలకృష్ణ. తనకు,తన కూతురు సుహాసిని కి ఇటివల కళరంగంలో నంది అవర్డులు వచ్చాయని తన
ఉత్తమ వైద్యధికారిగా పలు జాతీయ,రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులొచ్చాయని, తనకు సహకరించిన అందరికీ, తల్లిదండ్రులకు ధన్యవాదములు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డా. వేణుగోపాలకృష్ణ తో పాటు ఉదయ్ చంద్ర. వృద్ధశ్రమం సిబ్బంది రా ము, నగేష్,అనురాధ, కృష్ణవర్మ, పుల్సింగ్ సత్య పాల్,నితిన్ పాల్గొన్నారు.