కన్న కూతిరి మీద కన్నేసిన కామందుడుని కటకటాల కి పంపిన నిర్మల్ పోలీసులు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఒక కసాయి తండ్రి.అతనికి ఇద్దరు బార్యలు.మొదటి బార్యకు ఇద్దరు పిల్లలు*రెండవ బార్యను చంపిన కేసులో కారాగార శిక్షను అనుబవించి ఈటీవల జైల్ నుండి నిర్మల్ కి వచ్చాడు,కన్న కూతురి మీద కన్నేసి అత్యాచారం చేసిన కాసాయి తండ్రి.
పోలీసులను ఆశ్రయించిన బాదితురాలు.ఆ కాసాయి తండ్రి ని కటకటాల కి మళ్ళీ పంపిన నిర్మల్ పోలీసులు*
కేసు వివరాలు:-
దుదులే సంజీవ్ వయస్సు 38 సవత్సరాలు వృత్తిరీత్యా కూలి. నేరస్తుడు కి భార్య (బాదితురాలి తల్లి), ఒక కొడుకు, ఒక కూతురు (బాదితురాలు) కలరు. నేరస్తునికి మొదటి భార్య పిల్లలు ఉన్నా గాని మరో స్త్రీ తో సన్నిహితంగా తాండ్ర గ్రామం సారంగాపూర్ మండలం లో గల ఇటుక బట్టి లో కలిసి ఉంటూ కూలి పని చేసుకుంటూ ఉన్నారు. నేరస్తుడి రెండవ బార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని అనుమానం వచ్చి 2014 వ సంవత్సరంలో వాళ్ళు పని చేసే ఇటుకబట్టి లోనే తనని ఇటుకతో కొట్టి చంపి వేయగా పోలీసు స్టేషన్ సారంగాపూర్ నందు కేసు నమోదు అయింది.అట్టి నేరం లో నేరస్తుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. దాదాపు 5 నెలల క్రితం నేరస్తుడి యొక్క ప్రవర్తన ను అనుసరించి జైలు నుండి విడుదల చేశారు.నేరస్తుడు జైలు నుండి విడుదలయిన తరువాత తన కన్న కూతురిని (బాదితురాలు) కామా వాంఛతో చూడడం మొదలు పెట్టాడు, ఆమెను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని అనుకోని వారిని కూలి పనుల నిమిత్తం గుండంపల్లి గ్రామం, దిలవార్పూర్ మండలం కు తోలుకొని వచ్చాడు. తన కన్న కూతురిని ఎలాగైనా అనుభవించాలని తేది 19.07.2024 రాత్రి 10 గంటల సమయంలో తన కూతురిని శారీరక సుఖానికి ఆహ్వానించగా తను నిరాకరించి తన తల్లి (బాదితురాలి తల్లి) వద్దకు వెళ్లి చెప్పగా కూతురితో అలా చేయడం తప్పు కదా అని వారించగా వారిని కొట్టి బెదిరించి ఎలాగైతే రెండవ బార్యను చంపివేశానో అలాగే అతని భార్య పిల్లలను చంపివేస్తాను అనగా బదితురాలు, బాదితురాలి తల్లి ని చంపేస్తానని బెదిరించి తన కూతురినే బలవంతంగా అత్యాచారం చేశాడు, ఇలా అతను తన కూతురిని శారిరకంగా వేదించాడు.
బాదితురాలి తల్లికి మరియు తన అన్నకి జరిగిన విషయం చెప్పి గుండంపల్లి నుండి వచ్చి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా పోలీసులు కేసు క్రైమ్ నెంబర్. 73/2024 యు/ఎస్64(2),(ఎఫ్),65(1), 351(2),115(2) బి ఎన్ ఎస్ మరియు సెక్షన్. 6 ఫోక్స్ ఆక్ట్-2012 గా నమోదు చేశారు. నేరస్తుడు నేరం చేసి పూణే కి పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. పోలీస్ సిబ్బంది నూతన పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం తో నేరస్తుడు తేది 27.07.2024 న బాసర కు వచ్చి తేది 28.07.2024 న నిర్మల్ వైపుకి తన మోటార్ సైకిల్ పై వచ్చుచున్నాడాని తెలుసుకున్నారు. సిర్గాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకొని అతని వద్ద నుండి మోటార్ సైకిల్.బి నంబర్. ఏపీ15ఏ బి7013 స్వాధీన పరచుకొని ని౦దితున్ని రిమాండ్ కి తరలించారు.
ఇట్టి కేసు ను శోదించడంలో నిర్మల్ డి.ఎస్పి. గంగా రెడ్డి గారి పర్యవేక్షణ లో ప్రతిభ కనబర్చిన నిర్మల్ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , రాజేశ్వర్ గౌడ్ ఎస్.ఐ దీలావరపూర్,మాన్ సింగ్ ఏ.ఎస్ఐ మరియు శ్రీనివాస్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, కానిస్తేబుల్ గణేష్ , రమేష్ లను జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐ.పి.ఎస్ అభినందిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking