జమ్మికుంట మార్కెట్ చైర్మన్ రేసులో సుంకరి రమేష్ ముందంజ

– నియోజకవర్గ పరిధిలో విస్తృత సంబంధాలు కలిగిన నాయకుడు
– మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అనుభవం

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 29

కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన నిబద్ధ కార్యకర్త సుంకరి రమేష్. ఏండ్లుగా పార్టీలో కొనసాగుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు, వ్యాపారస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకంతో విస్తృత సంబంధాలు కలిగిన సుంకరి ఉమామహేశ్వరి రమేష్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ముందు వరుసలో నిలుస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి హస్తం పార్టీలో కార్యకర్తగా మొదలై.. నాయకుడిగా పార్టీలో ఎదిగి.. పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. జననేత, దివంగత సీఎం డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపి అధికారం దరిదాపుల్లో లేని సమయంలో పార్టీ నే నమ్ముకుని సేవలందించారు. సుంకరి రమేష్ ఆనాటి అధికార పార్టీ బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.

టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. సహజ వనరులు ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ నాయకుడు రమేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆపన్న హస్తం అందిస్తూ.. సొంత డబ్బులతో కార్యక్రమాలను నిర్వహించడం లోనూ వెనకాడ లేదు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న రమేష్.. తనకు పార్టీలో ఉన్న విస్తృత అనుభవం పరిజ్ఞానం నేపథ్యంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్ గిరి రేసులో రమేష్ అభ్యర్థిత్వం ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇల్లందకుంట దేవస్థాన కమిటీ సభ్యుడిగా, రెండు పర్యాయాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సేవలందించిన సుంకర రమేష్ కు చైర్మన్ గిరి దాదాపుగా ఖరారు అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేసులో ఉన్న వారిలో రమేష్ అభ్యర్థిత్వం అందరికంటే ముందున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking