ఘనంగా అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల దినోత్సవం

 

వీణవంక ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 3

వీణవంక మండల లో అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామల దేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం.శ్రావణి తల్లిపాల దినోత్సవాలు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking