జిల్లా కలెక్టర్ కు వినతి చేసిన బీసీ సంఘాలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపి,ఆ తర్వాతనే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ బీసీ ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టర్ కు శనివారం రోజున వినతి పత్రం ఇచ్చారు.మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము అధికారం లోకి వస్తే కుల జనగణన చేస్తాం, అదేవిధంగా బీసీ వర్గాల వ్యక్తులకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పిదప కుల గణన హామీ ఇప్పటివరకు అమలు జరపలేదు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రయత్నాలు మొదలయినాయి.ఇది ప్రజల కిచ్చిన హామీనిభంగ పరచడమే.ఇట్టి విషయమై ప్రభుత్వం పునరాలోచన చేసి బీసీ జన గణన సత్వరం చేపట్టాలని ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.కుల జనగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే స్థానిక సంస్థల పన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, సీనియర్ బీసీ నాయకులు కనుకుంట్ల మల్లయ్య, శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, అర్కాల ఓదెలు,పద్మశాలి సంఘం నాయకులు నాగరాజు,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్ఫురి అఖిల్,వేముల మల్లేశం,అడిచర్ల రాజయ్య, గుంటుక సోమన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.