జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో జిల్లా కానిస్టేబుల్ కి కాంస్య పతకం

జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
అభినందించిన పోలీసు అధికారులు.

మెదక్ ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు 5వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో జిల్లా పోలీస్ సాయుధ దళ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ గౌడ్ పాల్గొని కాంస్య పతకం సాదించిన సందర్భంగా కానిస్టేబుల్ టి.ప్రభాకర్ గౌడ్ ని శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ… జిల్లా పోలీస్ సాయుధ దళ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ గౌడ్, తేదీ:30,31.12.2023 లలో GHMC బాలయోగి స్టేడియం గచ్చిబౌలి, హైదరాబాద్ నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో మెదక్ జిల్లా తరపున 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి వెండి పతకం సాదించి 5వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైనాడని అలాగే ఈ నెల తేదీ:08.02.2024 నుండి 11.02.2024 వరకు GHMC బాలయోగి స్టేడియం గచ్చిబౌలి, హైదరాబాద్ నిర్వహించిన 5వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలలో తెలంగాణా రాష్టం తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరచి జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాదించి మే నెలలో శ్రీలంకలో జరగబోయే అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు దేశం తరపున పాల్గొనడానికి ఎంపికవడం జిల్లా మరియు రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమని అన్నారు. ఇక ముందు కూడా క్రీడా పోటీలలో పాల్గొని మరెన్నో పతకాలు సాదించి జిల్లా మరియు రాష్ట్ర పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. అలాగే జిల్లా పోలీస్ శాఖ క్రీడాకారులకు క్రీడా పోటీలలో పాల్గొని పతకాలు సాదించడానికి అన్నీ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ గారు,సాయుధ దళ డి.ఎస్.పి శ్రీ.రంగ నాయక్ ,తూప్రాన్ డి.ఎస్.పి శ్రీ.యాదగిరి రెడ్డి , యం.టి.ఆర్ ఐ.శ్రీ.నాగేశ్వర్ రావ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking