మెట్రో రైలును లింగంపల్లి రామచంద్రపురం పటాన్చెరు సంగారెడ్డి మీదుగా సదాశివపేట వరకు పొడిగించాలి.

గోదావరి అంజిరెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షురాలు
భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో జిల్లా అధ్యక్షరాలు గోదావరి అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెట్రో రైల్ సదాశివపేట వరకు పొడిగించాలి అనే మహా ధర్నా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మరియు దుబ్బాక మాజీ శాసనసభ్యులు ఎం రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెట్రో ట్రైన్ ను సంగారెడ్డి వరకు పొడిగించాలని అనేక ధర్నాలు నిర్వహించమని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి వరకు పొడిగించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం కోరడం జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని అన్నారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరువు ఇస్నాపూర్ లగడారం సంగారెడ్డి సదాశివపేట ఈ ప్రాంతాలలో అనేక పరిశ్రమలు ఉండడం వల్ల దేశంలో వివిధ రాష్ట్రాల నుండి కార్మికులు నివసించడం జరిగింది వీళ్ళ సౌకర్యార్థం ప్రతిరోజు హైదరాబాదుకు సంగారెడ్డి కు రవాణా కోసం మెట్రో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ కంటే కూడా మెట్రో ట్రైన్ పడుకుంటే పొడిగించడం చాలా సులభతరమని మెట్రోలో కూడా ప్రయాణం చేయడం వల్ల సమయం ఆదావుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, కన్వీనర్లు కోకన్వీనర్లు మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు వివిధ పదాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking