పర్యావరణ పరిరక్షణకై సంగారెడ్డి నుండి ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు పాదయాత్ర.

 

పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన

…ఎల్ చంద్రశేఖర్, జాతీయ అధ్యక్షులు
…డి అశోక్ జిల్లా అద్యక్షులు
తెలంగాణ జర్నలిస్టు యునియన్

సంగారెడ్డి పిబ్రవరి 13 ప్రజ బలం ప్రతినిది:
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకై జీవాయువును పెంచుటకై చేస్తున్న పాదయాత్రను ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్& బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు L చంద్రశేఖర్ రావ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణ కొరకు చేస్తున కార్యక్రమానికి అందరు సహకరించి కాలుష్యాన్ని నియంత్రించడం కోసమే నీ ఉద్యమం చేస్తున్నాము, అంతకుముందు పరిశుద్ధ కార్మికులను సన్మానించమన్నరు. ప్రతి ఒక్క సిటీని, గల్లీని, రోడ్లను క్లీన్ చేసి (పరిశుభ్రంగా ఉంచడంలో) కీలకపాత్ర వాళ్ళదే కావున వారిని ముందుగా సన్మానించడం జరిగిందని అన్నారు.

కావున కాలుష్యం లేని దేశంగా తీర్చిదిద్దడనికి మేము చేస్తున్న సహకారానికి అందరి సహాయ సహకారంతో ఈ సమస్యను, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి, సంగారెడ్డి నుండి సీఎం క్యాంపైస్ వరకు పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం కళాకారుల నృత్యాలతో పాదయాత్రగా వెళ్లి ib లోని వివేకానంద స్టాచ్యు కు, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, మహాత్మ జ్యోతిరావు పూలే లకు పూలమాలను సమర్పించి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రారంభమైన పాదయాత్ర కు తెలంగాణ జర్నలిస్టు యునియన్ జిల్లా అద్యక్షులు డి. అశోక్, కుడ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య, సభ్యులు రాములు, కొండయ్య, మల్లేష్, రవిరాజు, వేణుగోపాల్ బాలకృష్ణరెడ్డి, ఇందూరి క్రిష్ణ, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking