విద్యార్థులకు అండగా గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 13 ఫిబ్రవరి 2024:
మణికొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న 206 మంది విద్యార్థులు ప్రొద్దున లేవగానే 8.30 కి స్కూలుకు విచ్చేసి మధ్యానం స్కూల్ వారు అందించే మధ్యన్న భోజన పధకం ద్వారా భోజనం ముగించుకొని తదుపరి స్కూల్ సమయానంతరం సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థిని విద్యార్థులు ఆకలికి అలమటించకుండా సరియైన సమయానికి పౌషకాహారాల అల్పాహారాన్ని వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ గారి సమక్షంలో గత వారం రోజులుగా ట్రస్ట్ సభ్యుల సహకారాలతో సరఫరా చేయడం జరిగినదని ట్రస్టు యొక్క మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, కన్వీనర్ నిర్మల్ చంద్ లు తెలియ పరుస్తు ఇప్పటివరకు ట్రస్ట్ కేవలం తమ సభ్యుల సహకారాలతో దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగించినదని, మొట్ట మొదటగా విద్యార్ధుల సౌకర్యార్ధం ఆల్ కాలనీ ఫెడ్రేషన్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ పుణ్య దంపతులు కుటుంబ సమేతంగా వారి యొక్క పెండ్లి రోజు సందర్భంగా విద్యార్ధుల సాయంత్రపు అల్పాహారం వితరణ గురుంచి స్వచ్ఛందంగా అక్షరాల పదివేల రూపాయలు ఇవ్వడం జరిగినదని మరి అట్లాగే ఇట్టి సహయకర చర్యలో భాగంగా మణికొండ నార్సింగి రోడ్ లో గల బీ.ఆర్.సి కి ఎదురుగా ఉన్న గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ లో నివసించే వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాబోయే పది రోజుల వరకు తోచిన విధమైన అల్పాహారం ఇవ్వడానికి ఏర్పాట్లు గావించినారని అందులో భాగంగా ఈ రోజు ఫ్రూట్ బ్రెడ్ బట్టర్ పిల్లలందరికీ అందివ్వడం చాలా సంతోషకర విషయమని ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు వారి సేవలను కొనియాడుతూ ఇట్టి దిన చర్య రాబోయే మార్చి 15 వరకు ఉంటుంది కావున మణికొండలో ఉన్న అన్ని అపార్ట్మెంట్ నివాసులు, పురజనులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజా నాయకులు, కుల సంఘ పెద్దలు ముందుకు వచ్చి వారి వారి ఇస్టానుసారం తోచిన తిను బండారాల అల్పాహారం విద్యార్ధుల సౌకర్యార్ధం సమకూర్చడానికి ముందుకు రావాలని వినమ్ర పూర్వకంగా కోరుతు, ఇట్టి సమయంలో నేటి అల్పాహార దాతలు గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ నివాసులు, స్కూల్ టీచర్లు ఆదిగా కార్య క్రమంలో పాల్గొనడం జరిగినదని, ట్రస్ట్ తరపున అట్టి దాతలకు మరియు సీతారాం ధూళిపాళ దంపతులకు ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking