అహల్లాదకరమైన వాతావరణం కొరకే మినీ పార్క్.

మినీ పార్క్ నిర్మాణానికి కార్యదర్శుల చొరవ అభినందనీయం.
మండల పరిషత్ కార్యాలయంలో పార్కు ప్రారంభించిన ఎంపీడీవో.

జమ్మికుంట, ప్రజబలం ప్రతినిధి ఫిబ్రవరి 13

జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నూతనంగా నిర్మించిన మినీ పార్కును ఎంపీడీవో కల్పన లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో కల్పించడం కొరకు మా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ తమ సొంత నిధులతో మినీ పార్కు నిర్మాణం చేపట్టి కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయ ఆవరణంలో మినీ పార్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 20 మంది కార్యదర్శులు సుమారు లక్ష రూపాయలు వెచ్చించి తమ సొంత డబ్బులతో నిర్మాణం చేశారని వారి కృషిని అభినందించాలని ఆమె అన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు పిల్లలకు పార్కులో కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎంపీడీవో కల్పన సూచన మేరకు కార్యదర్శులు అందరూ పార్క్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు.

ఎంపీడీవో కల్పన సేవలు మర్చిపోలేనివి.

బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో కల్పన సేవలు మర్చిపోలేని వారు అందించిన సహాయ సహకారాలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని వారు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఇంతకన్నా ఎక్కువ సేవలు అందిస్తూ అక్కడి ప్రజల మంననలు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని సిబ్బంది ఆమె ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking