పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన కలెక్టర్

 

పీర్జాదిగూడలోని డంపింగ్ యార్డ్, పార్క్, బోడుప్పల్ లోని పార్క్, డంపింగ్ యార్డ్, మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాల ను సందర్శించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్.

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 13:
మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ డ్రై రిసోర్సు సెంటర్ ను మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్నా తడి చెత్తను పొడి చెత్తగా మార్చే ప్రాసెస్ గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాసెస్ చేసిన వ్యర్థ పదార్దాలను జవహర్ నగర్ డంప్ యార్డుకి పంపించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం బుద్దనగర్ లోని పార్కును సందర్శించి పాదచారులకు కావలసిన సదుపాయాలు కల్పించాలన్నారు.
తరువాత బోడుప్పల్ లక్ష్మి నగర్ లోని హుడా పార్క్ సందర్శించి ఈ సందర్బంగా మాట్లాడుతూ సందర్శకులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని అన్నారు. పిల్లలు, పెద్దలు ఆడుకోవడానికి అనువుగా ఆట స్థలాల అభివృద్ధి మరియు సేద తీర్చడానికి మరికొన్ని పార్కులు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.అక్కడి నుండి మల్లికార్జున నగర్ లోని మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేసి పిల్లలతో ముచ్చటిస్తూ ఇప్పుడు మీరు ఎంత కష్టపడి బాగా చదువుకుంటే అది మీభవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేర్చడంలో దోహదపడుతుందన్నారు. వసతి గృహంలో భోజన పట్టిక ప్రకారం భోజనం పెడుతున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారుల కోసం నిర్మాణంలో ఉన్న వెజ్ నాన్వెజ్ మార్కెట్ల భవన సముదాయములను సందర్శించి నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. బోడుప్పల్ లోని రా చెరువు ను పరిశీలించి, సుందరీకరణ పనుల పై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్న నీటి పారుదల శాఖ మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో రా చెరువు సుందరీకరణ త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు.
ఈ పర్యటనలో బోడుప్పల్ మున్సిపల్ కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కమీషనర్ నమ్య ఇస్లావత్, మేడిపల్లి తహసీల్దార్ హసీనా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking