ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 20 (ప్రజాబలం) ఖమ్మం ఒక ప్రధాన పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్త ను చూపిస్తూ ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పై ఎన్నికల సమయంలో దాడి చేయడానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర పన్నారని నిరాధారమైన ఆరోపణలను బిఆర్ ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజి డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ మక్బూల్, దండా జ్యోతి రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు తాజ్ఉద్దీన్, ఉద్యమకారుడు బొమ్మెర రాంమూర్తి, నరేందర్, లీగల్ సెల్ నాయకుడు మేకల సుగుణ రావు తీవ్రంగా ఖండించారు తుమ్మల పై దాడి చెసే అవసరం మాకు లేదు. అబద్ధాలను నిజం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు గత ఎన్నికలలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చలేదు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి తోచని స్థితిలో ఆయా అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ నేతల ఆరోపణలు హామీలు నెరవేర్చ కుండా ప్రజల ముందుకు ఎలా వస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కుయొక్తులు పన్నుతున్నారు మాజీ మంత్రి పువ్వాడ కుటుంబంపై ప్రత్యర్థులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత సమస్యల గురించి మాట్లాడండి అన్నారు ప్రత్యర్థుల మీద ఆరోపణలు సృష్టిస్తు రాజకీయం చేయడం సరికాదు ఇటువంటి రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు