వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతుల వేడుకోలు

 

మబ్బు పట్టిన ఆకాశం..

వడ్లన్నీ కల్లాల్లోనే దిగులు పడుతున్న రైతన్న

వర్షం పడితే కష్టమంతా నీటిపాలయ్యే అవకాశం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 20 : వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు,మబ్బు పట్టిన ఆకాశం,వడ్లన్నీ కల్లాల్లోనే దిగులు పడుతున్న రైతన్న వర్షం పడితే కష్టమంతా నీటిపాలయ్యే అవకాశం మంచిర్యాల జిల్లాలో రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలవుతున్నారం వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలుకు వేగం పెంచిందని రైతులు డిమాండ్ చెస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో జన్నారం, దండేపల్లి,లక్షెట్టిపేట,హాజీపూర్ రైతుల పంట నాశనం అవుతుందేమోనవి రైతులు ఆందోళనతో అకాల వర వాతావరణ శాఖ హెచ్చ యంత్రాలకు పెరిగింది.రైతుల కటింగ్ కాక వడ్లు రాలి ఏర్పడింది. వడ్లు తుడిచే పరిస్థితి,వర్షం పడితే మొలకలు పరిస్థితి ఉందని రైతులు.ఆకాశమంతా మబ్బులు పట్టడంతో వడ్లన్నీ కల్లాల్లో ఉండడంతో జిల్లాలోని రైతన్న దిగులు పడుతున్నాడు.‌ వర్షం పడితే ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైతుల గోస వర్ణాతీతంగా మారిపోయింది. చేతికొచ్చిన పంట నాశనం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడతాయానే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి కోత యంత్రాలకు భారీ డిమాండ్ పెరిగింది.మరి కొంత మంది రైతులు వరి పొలాల్లో వరి కటింగ్ కాక వర్షం పడితే వడ్లు రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే కటింగ్ చేయకపోతే, వర్షం పడ్డాక కటింగ్ చేస్తే మిషన్ దిగబడే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రైతులు వడ్లను కల్లాల్లో ఆరబెట్టే సమయంలో కనక వర్షం పడితే ధాన్యం తడిసి మొలకలు వచ్చి నష్టపోయే పరిస్థితి.ఇప్పటికైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రంగం, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవ చూపి వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లను వేగంగా కోనేలా చర్యలు చేపట్టాలని మంచిర్యాల నియోజకవర్గం రైతన్నలు కోరుతున్నారు.తగు చర్యలు చేపట్టినట్లయితే కనీసం పెట్టుబడి అయినా చేతికొస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.సంబంధించిన అధికారులు వెంటనే దీనిపై వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking