ప్రజాబలం ప్రతివీధి నిర్మల్ జిల్లా..ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శనివారం ఇంద్రవెల్లి లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. వారిని త్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగాలు వృధా పోలేదని అన్నారు.జల్ జంగల్ జమీన్ కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది అన్నారు. ఇందులో ఇంచార్జీ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆడే గజేందర్,శ్యామ్ నాయక్ ,రాథోడ్ బాపురావు ,నయ్యన్న గారి మురళి, గాజుల రవికుమార్, ఈసవేణి మనోజ్ యాదవ్ తదితరులున్నారు