తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైనా నేడు మణికొండ మున్సిపాలిటీ ఆర్ కే సర్కిల్ వద్ద తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమర వీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన ఎందరో అమరులకు నివాళులు అర్పించి, మలిదశ ఉద్యమాన్ని తమ నాయకత్వంలో ముందుకు నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నామని అన్నారు.
ఉద్యమకారులకు ఘన సన్మానం తొలి దశ ఉద్యమంలో పాల్గొని లాఠి జులుంకు అదరక బెదరక పిడికిలి బిగించి జై తెలంగాణ అనే నినాదంతో ముందుకు కదిలిన ముత్తంగి లక్ష్మయ్యకు ఘనంగా సత్కరించడం జరిగింది. మలి దశ ఉద్యమ కారుడు వసంత్ చౌహన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమంలో పాల్గొని తనదైన శైలిలో పాత్ర పోషించి ప్రాణ త్యాగానికి సిద్దపడిన 2వ వార్డు కౌన్సిలర్ వసంత్ కుమార్ చౌహన్ ను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్దొళ్లు శ్రీరాములు, కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ యాలాల నరేష్, పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు బషీర్, నాయకులు సత్యనారాయణ, ఏర్పుల కుమార్, శ్రీకాంత్, దిలీప్, కిరణ్, ఆరిఫ్ రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, శివ గంగా, స్పందన, శివ, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.