జులై 16న విశాఖ బీసీ గర్జన

విశాఖపట్టణం జూన్ 22 (); జులై 16న విశాఖ బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో టిటిడి చైర్మన్ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి గారితో కలిసి తేదీ ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి స్వర్ణకంకణ దారణ జరుపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన డిమాండ్లు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కేంద్రంలో సమగ్ర కులగణనలో బీసీల కుల గణన బీసీలకు క్రిమిలేయరు ఎత్తివేత బీసీ ఏట్రాసిటీ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లపై కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking