పనికి సమాన వేతనం కనీస జీతం 31 వేల రూపాయలు జీతం ఇవ్వాలి

పర్మినెంట్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
జీహెచ్‌ఎంఈయూ యూనియన్‌ అధ్యక్షులు ఊదరి గోపాల్‌
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ముందు అవుట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని అలాగే పర్మినెంట్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలని ఔట్సోర్సింగ్‌ కార్మికులకు పర్మనెంట్‌ అయ్యేంతవరకు సమాన పనికి సమాన వేతనం కనీస జీతం 31 వేల రూపాయలు వెంటనే పెంచాలని అలాగే పర్మనెంట్‌ ఉద్యోగులకు వెంటనే పిఆర్సి ఇవ్వాలని ఔట్సోర్సింగ్‌ కార్మికులకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని ఈ సమస్యల మీద ఎల్బీనగర్‌ జోనల్‌ ఆఫీస్‌ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడిరది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్‌ఎంఈయూ యూనియన్‌ అధ్యక్షులు ఊదరి గోపాల్‌ గారు హాజరై ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్‌ గారు చెప్పిన విధంగా జిహెచ్‌ఎంసి ఔట్సోర్సింగ్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని సమాన పనికి సమాన వేతనం కనీసం 31,000 జీతం ఇవ్వాలని పర్మనెంట్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డు తో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు ఎలాగైతే చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఇవ్వాలని లేని ఎడల ఇలాగే అన్ని జోనల్‌ ఆఫీస్‌ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించి భారీ పెద్ద ఎత్తున హెడ్‌ ఆఫీస్‌ జిహెచ్‌ఎంసిలో 15 వేల మందితో మహాధర్న కార్యక్రమాన్ని చేపట్టి అక్కడి నుండి ర్యాలీగా తెలంగాణ భవన్‌ వరకు వెళ్తామని చెప్పడం జరిగింది తక్షణమే మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని వెంటనే జిహెచ్‌ఎంసి ఔట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని చెప్పి లేనియెడల తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిహెచ్‌ఎంఈయు ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఔట్సోర్సింగ్‌ అధ్యక్షులు రాము, ఎంటమాలజీ అధ్యక్షులు మల్లేష్‌, ఎల్బీనగర్‌ జోన్‌ ప్రెసిడెంట్‌ సంజీవ, ప్రధాన కార్యదర్శి హనుమాన్‌ , సౌత్‌ జోన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కన్న,ఎంటమాలజీ ఎల్బీనగర్‌ జోన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌, అబిడ్స్‌ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్సింగ్‌ రావు,శ్రీనివాస్‌,ఔట్సోర్సింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్జున్‌ ,ప్రధాన కార్యదర్శి పరమేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి ,ట్రాన్స్పోర్ట్‌ సెక్షన్‌ అధ్యక్షులు రవీందర్‌, అలాగే యూనియన్‌ నాయకులు శేఖర్‌, కిషన్‌,స్వర్ణ కుమార్‌, రాజేంద్రప్రసాద్‌,అర్జున్‌, సత్యనారాయణ,తో పాటు యూనియన్‌ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking