జగిత్యాల ప్రతినిధి, జూన్ 20( ప్రజా బలం) తెలంగాణలో ఎన్నో సేవాకార్యక్రమాలతోపాటు గల్ఫ్ బాధితుల సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ కు వాటర్ కూలర్ ను అందజేశారు. తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సముద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జగిత్యాల ప్రెస్ క్లబ్ లో అద్యక్షులు చిటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి లకు అందజేశారు. ఈ సందర్భంగా సముద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల సమస్యలపై తమవంతు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వానికి చేరేలా సహకరించాలని కోరారు. ఎన్.ఆర్.ఐ.పాలసీ అమలు కోసం పోరాటం ప్రదానమన్నారు. గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ద్వారా ఎన్నో ప్రజా సేవ కార్యక్రమాన్ని చేపట్టామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉట్నూరి రవి, బోర విశ్వనాథ్, జెల్ల సంతోష్ తోపాటు పాత్రికేయులు సంపూర్ణచారి, సిరిసిల్ల వేణుగోపాల్, వంశీ, మదన్, రాజుకుమార్, లక్ష్మణ్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్ తోపాటు పలువురు ఉన్నారు.