గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ 5-2 బ్లాక్ లో వర్షాల కారణంగా డ్రైనేజీ పొంగి పొరిలింది, అక్కడి ప్రజలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు, భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్,ఆదేశాల మేరకు గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జ్ నందకిషోర్ బిలాల్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు, మున్సిపల్ అధికారులతో కలిసి అక్కడి ప్రజలకు కలుగుతున్న సమస్యను క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు డిప్యూటీ కమిషనర్ ధనవంతుడు నాయక్, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, అశోక్, రాంబాబు, భరత్, కులశేఖర్ తో కలిసి జాంబాగ్ డివిజన్ బీ ఆర్ ఎస్ నాయకులు మీసాల క్రాంతి, మైనారిటీ సెల్ క్రిస్టియన్ అధ్యక్షులు కెయం నరేందర్, ఆర్గనైజర్ సాయిబాబా, యువజన అధ్యక్షులు సురేష్, సెక్రెటరీ అంజన్, అశోక్, స్థానిక నాయకులు దుర్గేశ్వరి, యాది, ఆకాష్, నరేందర్, ప్రశాంత్ ముఖ్య నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారుల సహకారంతో అక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయడం జరిగింది.