సి.బి. ఎస్.ఈ నియమ నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపు రద్దుకై విజయవాడ రీజినల్ ఆఫీసర్ మీనాజోష్ కు వినతి
…….పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు ఎం. సురేష్
సంగారెడ్డి ఏప్రిల్ 29 ప్రజ బలం ప్రతినిది:శనివారం రోజున విజయవాడలో సి.బి.ఎస్.ఈ స్కూల్స్ లైజీయం, సంఘమిత్ర హై స్కూల్ ,రెయిన్బో రావుస్ (Rao’s) స్కూల్ లో చట్ట విరుద్ధంగా నడుస్తున్న స్కూల్స్ గుర్తింపు రద్దు కొరకై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం{ పి డి ఎస్ యు} సంగారెడ్డి జిల్లా కమిటీ ఆద్యవరియములో విజయవాడ రీజినల్ ఆఫీసర్ మీనాజోష్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో CBSE పేరుతో నియమ నిబంధనలు పాటించకుండా చట్టావిరుదాంగా నడుస్తున్న పాఠశాలలో జహీరాబాద్ పట్టణంలో లైజియం రావుస్ మరియు బీర్యంకూడా. రెయిన్బో స్కూల్ .పాఠశాలలో కూర్చోవడానికి సరి అయిన వసతులు లేవు, పాఠశాలలకు పార్కింగ్ స్థలాలు లేవు మూత్రశాలలు లేవు. అపశుభ్రమైన పరిసర ప్రాంతాలలో పాఠశాలను అధిక ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. కేవలం లాభార్జన దేయంగా ఎవరు ఏమైపోయినా మాకేంటి అన్న పద్ధతుల్లో నడుపుతున్నారు. ఇందులో బాగంగా జహీరాబాద్ పట్టణంలో లైజియం స్కూల్ అయితే మున్సిపల్ పార్కు స్థలాన్ని కబ్జా చేశారు. (అంతేగాకుండా జహీరాబాద్ కోర్టులో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు ఫైర్ నియమ నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్న స్కూల్ పై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నది) విద్యా కు చట్టంలో విద్యార్థులకు తప్పనిసరిగా గ్రౌండ్ ప్రాధాన్యం ఉండాలి. కానీ ఏ ఒక్క స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ {P.E.T}లేరు పాఠశాలలో క్రీడా ప్రాంగణం లేవు. సక్రమ క్రీడా ప్రాంగణం లేక విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి నెలకొంది, సక్రమమైన అయినా ఉపాధ్యాయులు లేరు ఇలాంటి పాఠశాల మూలంగా భవిష్యత్తు తరాలకు పెను ముప్పు ఉంది. కావున తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. సీబీఎస్ఈ నియమ నిబంధనలు పాటించకుండా నడుస్తున్న పాఠశాల గుర్తింపు రద్దు చేసి, వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని, విద్యార్థిని తల్లిదండ్రుల ఆలోచన చేసి నియమ నిబంధనలు పాటించని పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే నియమ నిబంధనలు పాటించని పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని అన్నారు. కార్యక్రమంలో. పి డి ఎస్ యు నాయకులు సాహితు .సురేష్ .మనోజ్ తదితరులు పాల్గొన్నారు.