ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య ఆదేశాల మేరకు పేదోడి సొంత ఇంటికల గృహలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 11వ వార్డులో ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది.గురువారం బీఆర్ఎస్ పార్టీ 11 వ వార్డు అధ్యక్షుడు ముత్తె తిరుపతి మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ఇల్లు నిర్మించుకొనుటకు మూడు లక్షల రూపాయల సాయం అందించడం జరుగుతుందని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 11 వ వార్డు నాయకులు గోపే అశోక్,సయ్యద్ సాబీర్, ఎంబడి అశోక్ కుమార్, బిక్కునూరి రాజేష్,రామగిరి సత్తయ్య,రాంపల్లి బానేష్ తదితరులు పాల్గొన్నారు.