ప్రతి పక్ష ప్రజా ప్రతినిదులపై చిన్న చూపు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలైన అభివృద్ధి ఏంటో చూపిస్తాం
నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆరోపించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష కార్పొరేటర్ల పై బిఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ సమావేశాలకు ఆయా డివిజన్ల కార్పొరేటర్లను పిలిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ అల చేయకుండా ఇస్టా రీతిన చేసే పనిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 54వ డివిజన్లో సిసి రోడ్డు నిర్మాణంలో అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తూ రోడ్డు పరిమాణం తగ్గిస్తున్నారని విమర్శించారు. ఇదేంటని అడిగిన ఆ ఏరియా కార్పొరేటర్లను అక్రమ అరెస్టులు చేయించారని మండిపడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్ఎస్ 9 ఏండ్ల కాలంలో అవినీతి అక్రమాలే రాజ్యమేలయని అన్నారు. నియంతృత్వ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… మొక్కుబడిగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందని అన్నారు. 54వ డివిజన్లో ఏసీబీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ లతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అని ఆ ప్రాంతంలో నాణ్యత కూడిన 30 అడుగుల రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఒక్కల్లికే పరిమితం కాదనే విషయం పోలీస్ లు అధికారులు గుర్తించాలని హెచ్చరించారు. రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలైన అభివృద్ధి ఏంటో చూపిస్తాం అని అన్నారు. అనంతరం నాగండ్ల దీపక్ చౌదరి, మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ.. తన పరిధిలో జరుగుతున్న అవినీతిపై ఒక మహిళను అర్ధ రాత్రి వరకు పోరాడినా కనీసం ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్ష నాయకులు అన్నా మహిళలు అన్నా ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని అన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో వీరితో పాటు నగరకార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, రఫేదాబేగం, మలీదు వెంక టేశ్వర్లు, మలీదు జగన్, రాష్ట్ర మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బానీ, మిక్కిలినేని నరేందర్