ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ ఆవరణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ బుధవారం తణిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పూర్తయ్యేల కార్యాచరణ చేయాలన్నారు. లేబర్ ఎక్కువమందింని వినియోగించి, పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అప్రోచ్ రహదారి, పనులకు ఆటంకాలు కలగకుండా ముందస్తు పనులను సెప్టెంబర్ నెలకారి వరకు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
కలెక్టర్ వెంట డి.ఈ.చంద్రశేఖర్,ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, గుతేదార్లు, అధికారులు తదితరులు ఉన్నారు