ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీ అధికారం ఖాయం.

 

జగ్గన్నగారి దామోదర్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ నాయకులు

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రైతు సంఘం జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు జగ్గన్న గారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆయన ప్రవేశపెట్టిన జనాకర్షణ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు బీసీ బందు, వృధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, కెసిఆర్ కిట్,ఇంటి ఇంటికి మంచినీటిని, చెరువుల పునరుద్ధరణ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాడని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో గడ్డం ప్రశాంత్ కుమార్,గంగాధర్ వెంకటేష్ , బిక్షపతి ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking