ప్రణాళికాబద్ధంగా ప్రగతి సాధిస్తున్నా మని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ అన్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మేయర్ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన, రోడ్లు డ్రైనేజీలు కార్పొరేషన్ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంపై సమావేశం కొనసాగింది. ఎజెండాలో పేర్కొన్న అంశాల వారీగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అధికారులు ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. సభ్యులు సూచించిన పనులను ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మీద రాజేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.