బెల్లంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలంలోని బట్వానపల్లి,పెరకపల్లి,దుగ్నేపల్లి, మాలగురిజాల,తాళ్లగురిజాల, లంబడితాండ,బుదాకలాన్, చంద్రవెల్లి,చాకేపల్లి,బుదాకూర్ద్ గ్రామపంచాయతీల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ…. కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి పునాదిలాంటి వారని,నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ,బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన, బిఆర్ఎస్ పార్టీపైన బిజెపి,కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు రెట్టింపుకావాలంటే రానున్న ఎన్నికల్లో కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని,కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్,బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్,వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఆకెనపల్లి,బూదాకలాన్,గురిజాల ఎంపీటీసీలు సుభాష్ రావు,అంకు శకుంతల-వెంకటేష్,లంబడితాండ, బూదాకలాన్,చంద్రవెల్లి,బూదాకూర్ద్,కన్నాల,సోమగూడెం,లింగాపూర్,అంకుశం గ్రామపంచాయతీల సర్పంచ్,రాయమల్లు,లక్ష్మీ-అశోక్,అశోక్ గౌడ్,కృష్ణమూర్తి, స్వరూప-వెంకటస్వామి,ప్రమీల గౌడ్, వెంకటేష్,రాజమోగిలి, ఎఎమ్ సి డైరెక్టర్ రవి,ఇతర ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్, మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, బిఆర్ఎస్, బిఆర్ఎస్ యూ, బిఆర్ఎస్ వి,అనుబంధ కమిటీల మండల,ఆయా గ్రామాల అధ్యక్షులు,సభ్యులు,బిఆర్ఎస్ యూ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవితేజ,మండల అధ్యక్షుడు మహేందర్,ఉపాధ్యక్షుడు కిరణ్ ,నాయకులు,కార్యకర్తలు, మహిళలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking