కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 6 లో మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ….ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు.ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు,మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని దివాకర్ రావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking